ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఆదివారం ఉదయపూర్లో వివాహం ద్వారా ఒక్కటయ్యారు. సన్నిహితుల సమక్షంలో వారి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లి ఫొటోలను పరిణీతి చోప్రా సోమవారం ఉదయం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. 'చాలా కాలంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాము. చివరకు మిస్టర్ అండ్ మిసెస్గా మారాము. ఒకరు లేకుండా మరొకరం జీవించలేం' అని క్యాప్షన్ ఇచ్చింది.