నేడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తృతీయ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 1946, జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించిన ఎస్పీ బాలు పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే ఆయనకు తొలి గురువు అయ్యారు.