ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'ఉస్తాద్ భగత్ సింగ్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 09:46 PM

హరీష్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ సినిమా హైదరాబాద్‌లో ఈరోజు మినీ షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌కి సంబంధించిన సన్నివేశాల కోసం చిత్ర నిర్మాణంలో చేరనున్నారు. ఈ షెడ్యూల్‌ వారం రోజుల పాటు జరగనుందని సమాచారం.

ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో అశుతోష్ రానా, గౌతమి, నాగమహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa