హరీశ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కాంబోలో 11 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇటీవల కొత్త షెడ్యూల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో పవనకల్యాణ్‌పై పవర్ ప్యాక్డ్ సీన్స్ చిత్రీకరించారు. ఈ విషయం గురించి దర్శకుడు హరీశ శంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఉస్తాద్ భగత్ సింగ్’లోని అత్యంత ముఖ్యమైన భాగం చిత్రీకరణ పూర్తయ్యింది. పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే పవర్‌ఫుల్‌గా నటించారు’’ అని ఆయన పేర్కొన్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్థమవుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa