రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'రూల్స్ రంజన్' అనే టైటిల్ ని ఖరారు చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణాలో 3.5.కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం 2023 అక్టోబర్ 6న విడుదలకి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లావానియా మరియు వి మురళీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.