‘జాతిరత్నాలు’ చిట్టి తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. రాయల్ వేర్స్ లో ప్రిన్సెస్ లా మెరిసి అట్రాక్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ‘జాతిరత్నాలు’తో సినిమా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. నవీన్ పొలిశెట్టి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే ఆడియెన్స్ ను ఫిదా చేసింది. ‘చిట్టి’ పాత్రలో అదరగొట్టింది.సినిమాల్లోకి రాకముందుకు ఫరియా అబ్దుల్లా మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్ గా, యూట్యూబర్ గా కొనసాగింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. డాన్స్ రీల్స్, పలు ఇంట్రెస్టింగ్ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.ఇక వెండితెరకు పరిచయం అయిన తర్వాత ఫరియా అబ్దుల్లా మరింత ట్రెండీగా మారిపోయింది. ఇప్పటికీ నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన బ్యూటీఫుల్ లుక్స్ తోనూ కట్టిపడేస్తోంది. లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తోంది.తాజాగా ట్రెడిషనల్ లుక్ లో యువరాణిలా మెరిసింది. క్రీమ్ కలర్ లెహంగా, ఫుల్ స్లీవ్ టాప్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. డిజైన్డ్ వేర్ డ్రెస్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. అందమైన మెడకు ఆకర్షణీయమైన నెక్లెస్ ధరించి ప్రిన్సెస్ లా వెలిగిపోయింది. ఫరియా అబ్దుల్లా ఎప్పుడూ ఇలా తన నయా లుక్స్ తో ఆకట్టుకుంటూనే వస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తూనే ఉంది. ఫ్యాన్స్ కూడా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫొటోలను, వీడియోలను లైక్స్, కామెంట్లతో నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. కెరీర్ విషయానికొస్తే.. ఫరియా చేతిలో ప్రస్తుతం ఓ తమిళ చిత్రం ‘వల్లి మయిల్’ ఉంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఎప్పుడో వచ్చింది. ఇక తెలుగులో చివరిగా ‘రావణసుర’తో అలరించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు అప్డేట్ లేదు. చిట్టికి ప్రస్తుతం సినిమాలు లేవని తెలుస్తోంది.