రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో గాయత్రి భరద్వాజ్ తెలుగుతెరకు పరిచయమవుతోంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సందర్భంగా హీరోయిన గాయత్రి భరద్వాజ్ విలేకర్ల సమావేశంలో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. మాది ఢిల్లీ. మా నాన్న పైలెట్, అమ్మ సైకాలజిస్ట్. సినిమా నేపథ్యం లేని కుటుంబం మాది. ఇంట్లో చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో ప్రోత్సహించేవారు. భరతనాట్యం, క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్నాను. కళలకు సంబంధించిన ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ వరల్డ్‌లో ఫేమస్ అవ్వాలని కోరిక. 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ టైటిల్ గెలిచాను. తర్వాత ఓ ప్రాజెక్ట్ సైన్ చేశాను. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. తర్వాత 'దిన్దొర’పాటు మరో సిరీస్ చేశాను. ఆలా సినిమాలలోకి వచ్చాను అని తెలిపారు.