‘‘సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలని నాకు లేదు.10 మంచి సినిమాలు చేసి.. వీలైనంత త్వరగా ఈ వృత్తి నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నా అని తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ అన్నారు. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక ట్వీట్‌తో గుడ్‌బై అంటూ అనౌన్స్‌మెంట్ చేయాలనుకున్నా. ఆ తర్వాత నచ్చిన మరికొన్ని పనులు చేస్తా. ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా. అయితే, ఇటీవల ఓ ఫంక్షన్‌లో దర్శకులు అందరం కలిశాం. వాళ్లు అలాంటి ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. వాళ్ల మాటలపై ఉన్న గౌరవంతో నేను రిటైర్‌మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు’’ అని ఆయన బదులిచ్చారు. అలాగే తదుపరి చిత్రాల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘దర్శకుడిగా లియో’ మీ ఐదో సినిమా. తదుపరి రజనీకాంత సినిమా పూర్తయ్యాక ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’, ప్రభాస్‌తో సినిమా చేయాలనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనా?’’ అన్న ప్రశ్నకు ‘అవును’ అని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఆయన దర్శకత్వం వహించగా ఈ నెల 19న విడుదల కానున్న లియో’ గురించి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు మొదట ‘ఆంటోనీ’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టాం. ఫైనల్‌గా ‘లియో’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఆంటోనీ పేరు నాకెంతో నచ్చడంతో సంజయ్ దత్ పాత్రకు ఆ పేరే పెట్టా. నేను ఏ సినిమా చేసినా సెన్సార్ పూర్తయ్యాకే దాని పేరును నా సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన బయోలో యాడ్ చేస్తుంటా. అదే మాదిరిగా ‘లియో’ను ఇటీవల యాడ్ చేశాను. అది కూడా హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం లియో విడుదలపైనే దృష్టంతా. ‘లియో2’ గురించి ఇప్పుడే చెప్పను. సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఈ సినిమా విడుదల తర్వాత వారం రెస్ట్ తీసుకుని రజనీకాంత్ సినిమా వర్క్ మొదలుపెడతా’’ అని లోకేష్ చెప్పారు. అంతే కాదు ఫహద్ ఫాజిల్ కోసం ‘మఫ్టీ’ అనే కథ సిద్థం చేశానని.. తన అసిస్టెంట్ డైరెక్టర్ దాన్ని డైరెక్ట్ చేస్తారని తెలిపారు.