ఏక్త కపూర్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ నిర్మాతల్లో బోల్డ్ బ్యూటీ అనొచ్చు. బాలాజీ టెలీఫిల్మ్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా, క్రియేటివ్ హెడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. దీనికి కో కంపెనీగా బాలాజీ మోషన్ పిక్చర్స్, ఆల్డ్ బాలాజీ సంస్థలను నెలకొల్పి, సినిమా, టీవీ, డిజిటల్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఏక్తాకపూర్ మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో.. ఆమె తీసే సినిమాలు, డిజిటల్ కంటెంట్ కూడా అంతే హాట్‌గా ఉంటాయి. వివాదాలు, విమర్శలు ఆమె కొత్తకాదు. ఆమె మరోసారి విమర్శల పాలైంది. నెట్లజన్లతో ప్రశ్న , సమాధానం అనే కాన్సెప్ట్ పెట్టిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకి ధీటుగా అవును నేను బోల్డ్ గానే ఉంటాను అన్ని సమాధానమిచ్చింది.