బాలకృష్ణ చాలా స్వీట్ అని, ఆయనది పసి మనసు అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. 'బాలకృష్ణను కలవక ముందు ఒక భయం ఉండేది. కానీ కలిసిన మరుక్షణమే ఆ భయం పోయింది. ఆయనది పసి మనసు. బాలకృష్ణకు సినిమాతో పాటు చాలా రంగాలపై నాలెడ్జ్ ఉంది. నేను మెడిసిన్ ఎగ్జామ్ రాసి వచ్చాక అందులోని చాప్టర్లపై లోతైన పరిజ్ఞానంతో మాట్లాడేవారు' అని తెలిపారు. కాగా, భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య, కాజల్, శ్రీలీల కలిసి నటించారు.