ఒకప్పుడు, తెలుగు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన సమీరా రెడ్డి సినీ పరిశ్రమలో మంచి ఆదరణ పొందింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్, ఇప్పుడు సినిమాల్లోకి వస్తానని, మంచి పాత్రల కోసం వెయిట్ చేస్తోందని సమీరా తెలిపారు. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ, క్రైమ్.. వంటి సినిమాల్లో నటిస్తానని అన్నారు. ఒక్క నిమిషం నిడివి క్యారెక్టర్ అయినా చేస్తాను అని వెల్లడించారు. ఆమె మెగాస్టార్ తో "జై చిరంజీవ" మూవీలో హీరోయిన్ గా చేశారు.