‘టైగర్ నాగేశ్వరరావు’లో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. తప్పకుండా అందరినీ అలరిస్తుందని హీరో రవితేజ అభిప్రాయపడ్డారు. ఆయన కథానాయకుడిగా నటించినఈ చిత్రం ఈనెల 20న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో ఫైట్లు, పాత్రలూ అన్నీ సహజంగా ఉంటాయి. హేమలతా లవణంగా రేణూ దేశాయ్ పర్ఫెక్ట్గా సెట్టయ్యారు. జీవీ ప్రకాశ్ కుమార్ పాటలకు మంచి స్పందన వస్తోంది. థియేటర్లో ఆ సౌండ్ నాక్కూడా వినాలని ఉంద’’న్నారు. ‘‘తెలుగు చిత్రసీమకు ఓ అత్యుత్తమ సినిమాని అందించాలన్న ప్రయత్నంతోనే ఈ సినిమా మొదలెట్టా. నేను అనుకొన్నట్టుగానే సినిమా బాగా వచ్చింది. రవితేజగారి నటన చూశాక స్ర్కీన్లు చిరిగిపోతాయ’’న్నారు వంశీ. ఈ సినిమా తన జీవితంలో చాలా కీలకమైనది రేణూ దేశాయ్ తెలిపారు.