లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే షో మొదలయ్యేలా అనుమతులు ఇచ్చింది.