ఇటీవల హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు రూ.6.50 లక్షల లంచం ఇచ్చినట్టు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్ అయిన కేంద్రం... ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి తాజాగా కొత్త ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై దక్షిణాది చిత్రాలకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో.. అదే కార్యాలయంలో తమిళం నుంచి హిందీలోకి అనువాదమయ్యే చిత్రాలకు కూడా సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందొచ్చని తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు ఈ విధానం అమలు చేయనున్నారు.