'పెళ్లిసందD' సినిమాతో స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న హీరోయిన్ శ్రీలీల.. ఇప్పుడు వరుస పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. ఈ తరుణంలో శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ హీరోతో లిప్ లాక్ సీన్ చేస్తారని 'భగవంత్ కేసరి' ప్రమోషన్లలో ఓ యాంకర్ ప్రశ్నించగా.. 'నేను లిప్ లాక్ సీన్లలో అస్సలు నటించను. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అలా చేయాల్సి వస్తే మాత్రం ఫస్ట్ లిప్ లాక్ కచ్చితంగా నా భర్తకే ఇస్తా' అని ఆమె తేల్చి చెప్పారు.