మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన రెంజూషా మీనన్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. ఆమె తన భర్తతో కలిసి తిరువనంతపురంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి పట్ల మలయాళ సినీ నటులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.రెంజూషా మీనన్ 'స్త్రీ', 'నిజలాట్టం', 'మగలుడే అమ్మ', 'బాలామణి' అనే సీరియల్స్ లో నటించారు. అలాగే ఆమె ‘సిటీ ఆఫ్ గాడ్’, ‘మెరిక్కుండోరు కుంజడు’ అనే సినిమాల్లో నటించింది.