తమిళ హీరో చియాన్ విక్రమ్ వైవిధ్యానికి మారు పేరు. ఎలాంటి పాత్ర అయినా సరే, సదరు పాత్ర నిమిషం ఉన్నా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆ పాత్రల కోసం తన మీదే ప్రయోగాలు చేసుకుంటూ ఆ క్యారెక్టర్లకు తగినట్టుగా మార్చుకుంటూ ఆ పాత్రల్లో జీవిస్తుంటాడు. అందుకు మంచి ఉదహరణలు శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, కోబ్రా సినిమాలు. ఇప్పుడు అదే కోవలో వస్తున్న మరో వినూత్న చిత్రం తంగలాన్. ఈ సినిమా కోసం గత చిత్రాలను మించి విక్రమ్ మేకొవర్ అయిన తీరు, పాత్ర విలక్షతను చూసి సినీ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. కమల్‌హసన్‌ను మించిపోతాడా అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. బ్రిటిష్ కాలంలో కేజీఎఫ్‌లో జరిగిన యధార్ధ ఘటనల అధారంగా ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తున్నది. గతంలో రంజిత్ రజనీకాంత్‌తో తీసిన కబాలి, ఆర్యతో చేసిన సారపట్ట వంటి చిత్రాలు విజయవంతమవడంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ రోజు విడుదల చేసిన తంగలాన్ చిత్ర టీజర్ ఆ అంచనాలను పదింతలు పెంచాయి. 1.33 సెంకడ్ల నిడివితో ఎలాంటి డైలాగులు లేకుండా వచ్చిన ఈ సినిమా టీజర్ చూసిన వారికి గూస్‌బంప్స్ తేవడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.టీజర్‌లో విక్రమ్ తన నట విశ్వరూపం చూయించడమే కాకా ఓ సన్నివేశంలో గిరి నాగును చేతితో ముక్కలుగా చేసి పార వేసే సీన్ ఒల్లు గగుర్పొడిచేలా ఉంది. దానికి జీవీ ప్రకాశ్ సంగీతం ఆగ్నికి ఆజ్వం తోడైనట్టుగా భయంకరంగా ఉంది. బ్రిలీష్ కాలంలో కొలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో బంగారం వెలికితీత క్రమంలో జరిగిన హింపాకాండ ఓ తెగ నాయకుడు వారికి ఎదురు నిలిచి చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, మళయాళం ,హిందీ భాషల్లో జనవరి 26 2024 గణతంత్ర దినోత్సవం రోజున థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.