‘సినిమా రంగంలో వస్తున్న వినూత్న సాంకేతిక పోకడలను అందిపుచ్చుకొని హైదరాబాద్ నగరం చిత్ర పరిశ్రమకు రాజధానిలా మారుతోంది’ అని నాగార్జున అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమంలో నాగార్జున, నాగ్ అశ్విన్, నిర్మాత సుప్రియ అతిథులుగా పాల్గొన్నారు. సినీ రంగానికి చెందిన 24 శాఖల సరికొత్త సాంకేతితకను ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘భారతీయ సినీరంగానికి దక్షిణాది చిత్ర పరిశ్రమ చుక్కానిలా మారింది. అందరూ మనల్నే అనుసరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎ్‌ఫఎక్స్ గురించి తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపకరిస్తాయ’ని అన్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఇప్పుడు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడకు వచ్చి సినిమాలు తీస్తున్నారు. నా తర్వాతి సినిమాను ఇక్కడి వీఎ్‌ఫఎక్స్ కంపెనీలతో కలసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’ అన్నారు.