‘ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇండియన్ యాక్టర్ అని చెప్పగానే ‘బాలీవుడ్’ అనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. సౌత్ ఇండస్ర్టీ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. దర్శకుడు అట్లీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అలాగే ‘కేజీఎఫ్’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ లాంటి చిత్రాలు వచ్చాయి. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఆస్కార్ సాధించి మా అందరికీ ఒక దారి చూపారు’’ అని విక్రమ్‌అన్నారు. తమిళనాట ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన తాజాగా ‘తంగలాన్’ అనే భిన్నమైన చిత్రంలో నటించారు. పా.రంజిత్ దర్శకుడు. వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ..... 'తంగలాన్’ లాంటి గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ‘తొమ్మిది నెలల’’ అనే సినిమా సమయంలో ఈ టీమ్‌తో కలిసి పని చేశాను. ఆ తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం కలిసి పని చేస్తున్నాను. టీమ్ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. ఈ చిత్రంలో గ్లామర్ అనేది ఉండదు. ఆడియన్స్ భావోద్వేగంగా కనెక్ట్ అవుతారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సినిమా అంతా లైవ్ సౌండ్‌లో చేశాం. అలా చేయడం ఎంతో కష్టం. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి తీసుకోకుండా చేశాం. ‘తంగలాన్’ తెగ వారు ఎలా జీవిస్తారో దాన్నే చిత్రీకరించాం. నా కెరీర్‌లో ఇలాంటి సినిమా చేయలేదు. నా మీద నమ్మకంతో ఇంత గొప్ప పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం తర్వాత దర్శకుడు నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడని కచ్చితంగా చెప్పగలను. టీజర్‌లో చూసింది శాంపిల్ మాత్రమే! థియేటర్లో ఈ సినిమా చూేస ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లిన భావన కలుగుతోంది. నా కెరీర్‌లో ‘శివపుత్రుడు’, ‘నాన్న’, ‘అపరిచితుడు’.. ఎలాగైతే ప్రత్యేకంగా నిలిచాయో అలాగే ‘తంగలాన్’ భిన్నమైన కథతో మీ ముందుకొస్తోంది. ఈ సినిమాలో నాకు డైలాగులు లేవు. ‘శివపుత్రుడు’ తరహాలో ఉంటుందీ సినిమా’’ అని అన్నారు