నటి సమంత తాను క్రయో థెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పొగలు వస్తున్న ఓ కంటైనర్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు సమంతకు మళ్లీ ఏమైందని ఆందోళన చెందుతున్నారు. పలు చర్మ సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ థెరపీ తీసుకుంటారని నిపుణులు చెబుతున్నారు.