ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు.
చంద్రమోహన్ నటించిన సినిమాలు: బంగారు పిచుక, ఆత్మీయులు, తల్లిదండ్రులు, బొమ్మబొరుసు, రామాలయం, కాలం మారింది, జీవనతరంగాలు, అల్లూరి సీతారామరాజు, ఓ సీత కథ, యశోద కృష్ణ, సెక్రటరీ, పాడిపండటలు, కురుక్షేత్రం, ఖైదీ కాళిదాసు, దేవతలారా దీవించండి, ప్రాణం ఖరీదు, సీతామాలక్ష్మి, శంకరాభరణం, తాయారమ్మ, బంగారయ్య, ఇంటింటి రామాయణం, కొరికలే గుర్రాలైతే, మంగళ తోరణాలు, సంఘం చెక్కిన శిల్పాలు, నాగమల్లి, గయ్యాళి గంగమ్మ, శుభోదయం, పక్కింటి అమ్మాయి, ప్రియ, కలహాల కాపురం.