ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) మృతి చెందారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను ఆయన అందుకున్నారు.
చంద్రమోహన్ అందుకున్న అవార్డ్స్: సీనియర్ నటుడు చంద్రమోహన్ తన కెరీర్లో 2 ఫిలింఫేర్, 6 నంది అవార్డులు అందుకున్నారు. 'పదహారేళ్ల వయసు', 'సిరి సిరి మువ్వ' సినిమాల్లో ఆయన నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 2005లో 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో 'చందమామ రావే' సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు అందుకున్నారు.