ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మ‌జిలి' నుండి మూడో సాంగ్ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2019, 09:30 AM

నాగ చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంక కౌశిక్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శివ నిర్వాణ తెర‌కెక్కించిన చిత్రం మ‌జిలి. దేర్ ఈజ్ లవ్ దేర్ ఈజ్ పెయిన్ ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్‌తో పాటు రెండు సాంగ్స్ విడుద‌ల చేసిన టీం తాజాగా ‘నా గుండెల్లో’.. అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేసింది. నాగ చైతన్య దివ్యాంక‌ కౌశిక్‌లపై చిత్రీకరించిన ఈ సాంగ్‌కి గోపీ సుందర్ స్వరాలను సమకూర్చగా.. రామ్ బాబు గోసల సాహిత్యం అందించారు. యాజిన్ నిజార్, నికితా గాంధీ ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్‌ను ఆలపించారు. ఈ సాంగ్ కూడా సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది. మ‌జిలీ చిత్రం పెళ్లి తర్వాత ప్రేమలో పడే ఓ జంట కథ . వారి జీవితంలోని ప్రేమ, బాధను హృదయానికి హత్తుకునేలా భావోద్వేగభరితంగా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది .


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa