పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా అజరిగిన ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు ఈ భారీ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాడు.
పెద్ద శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సాలార్ అని ప్రశాంత్ నీల్ అన్నారు. అతను ఇంకా మాట్లాడుతూ.... సాలార్ యొక్క ప్రధాన భావోద్వేగం స్నేహం. మొదటి భాగంలో సగం కథ చెప్పనున్నారు. కథకు ఎక్కువ స్కోప్ ఉంది మరియు ఇది రెండవ భాగాన్ని డిమాండ్ చేస్తుంది. సాలార్‌ని రెండు భాగాలుగా చేయాలనే నిర్ణయాన్ని మొదట్లోనే తీసుకున్నామని డైరెక్టర్ తెలిపారు.
ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ తన సినిమాల్లో సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి అని సరైన ఎమోషన్స్ లేకపోతే యాక్షన్ బ్లాక్స్ ఉండవని దర్శకుడు భావించినట్లు వెల్లడించారు. ప్రభాస్ స్నేహితుడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ సినిమాలో శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.