హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్ మాట్లాడుతూ..'అందరూ తప్పకుండా ఓటు వేయాలి. ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ ఓటు వేయండి. మీకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేయండి. అభివృద్ధి కొనసాగాలి. మన ఉద్యోగాలు మంచిగా చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. నా కుటుంబంతో వచ్చి నేను వచ్చి ఓటు వేశా'నని అన్నారు.