మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలో హీరో విశాల్ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) విఫలమైందని విశాల్ ఆరోపించారు. ఇప్పటికైనా చెన్నై కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని కోరారు.
మీరున్న ఈ సిటీలోనే మేం ఉన్నాం.. కానీ మీలాంటి స్థితిలో మేం లేము.. తుపాను నీళ్ల డ్రైన్ ప్రాజెక్ట్ చేసింది చెన్నై కోసమా? సింగపూర్ కోసమా?.. 2015లో మేం అంతా ముందుకు వచ్చి సాయం చేశాం.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేం సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్దంగానే ఉంటాం.. ఎనిమిదేళ్ల తరువాత కూడా అలాంటి పరిస్థితే.. అంతకు మించి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి'' అంటూ ట్విటర్‌లో చెన్నై కార్పొరేషన్‌పై విశాల్ ఫైర్ అయ్యారు.