బర్సాత్ (1995)చిత్రంతో బాలీవుడ్‌లో హీరోగా పరిచయమయ్యారు బాబీ డియోల్. మొదటి రోజు రూ.68 లక్షలు వసూళ్లు రాబట్టిన ఆ చిత్రం వారాంతానికి 1.69 కోట్లు వసూలు చేసింది. అదే సమయంలో విడుదలైన షారుక్ ఖాన్ 'డీడీఎల్‌జె’ చిత్రం మొదటి వారాంతానికి బర్సాత్ కన్నా తక్కువ వసూలు చేసింది. ఆ తర్వాత బాబీ డియోల్ నటించిన ఏ చిత్రము కూడా సరైన విజయం అందుకోలేదు. సల్మాన్ తో కలిసి నటించిన రేస్-3తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు బాబీ. ఈ మధ్యలో ఎన్నో చిత్రాల్లో నటించినా ఆశించిన ఫలితం దక్కలేదు. 1995 నుంచి ఆయన సోలో హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. మల్టీస్టారర్ చిత్రాల్లోనూ భాగమయ్యారు. అయినా ఆయన ఖాతాతో సింగిల్ బ్లాక్‌బస్టర్ లేదు. సినిమా హిట్ అయినా ఆయనకు క్రెడిట్ దక్కలేదు.ప్రస్తుతం ఆయన టాప్ ట్రెండింగ్‌లో ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు. ఈ చిత్రం రూ.500 కోట్లు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ చిత్రం బాబీ డియోల్‌కు ఎంతో ప్రత్యేకం. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన అందుకున్న విజయమిది. 28 ఏళ్ల సినీ కెరీర్‌లో ఆయనకు ఆరు పెద్ద హిట్స్ ఉన్నాయి. ఈ 28 ఏళ్ల కెరీర్‌లో 28 ఫ్లాప్స్ చవిచూశారు బాబీ. సందీప్‌రెడ్డి ఇప్పుడు ఆయన రాతను మార్చేశారు. యానిమల్‌లో ఆయన పోషించిన పాత్రలకు, బాడీ ఫిజిక్‌కు ట్రెమండస్ రెస్పాన్స వస్తోంది. దాంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇటీవల ముంబైలో ఓ థియేటర్‌కు వెళ్లి ఆడియన్సతో కలిసి సినిమా చూసిన ఆయన ప్రేక్షకులు చూపించిన ప్రేమకు ఫిదా అయ్యారు. పాత్రకు వచ్చిన స్పందనకు భావోద్వేగానికి లోనయ్యారు.