సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఒకవైపు బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రన్ అవుతుండగా, మరోవైపు ఈ సినిమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన కూతురు కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు.
కబీర్ సింగ్, పుష్ప, యానిమల్ వంటి సినిమాలు యువతకు చెడ్డ ఉదాహరణగా నిలుస్తున్నాయని అన్నారు. సినిమాలు సమాజానికి అద్దం పడతాయని మరియు యువ ప్రేక్షకులను ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయని ఆమె వెల్లడించారు.
యానిమల్ వంటి సినిమాలు విషపూరితమైన పురుషత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయని అవి సమాజానికి ఒక రోగం అని రంజిత్ రంజన్ పేర్కొన్నారు. కొంతమంది రంజీత్ రంజన్‌తో ఏకీభవిస్తుంటే మరికొంత మంది విరుచుకుపడుతున్నారు.