నితిన్ హీరోగా నటించిన 32వ చిత్రం ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రీలీల కథానాయికగా నటించింది. ప్రేక్షకుల్ని నవ్వించాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని చేశామని విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నితిన్ చెప్పారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్ మీడియా వేదిక గా నెటిజన్లు ఏమనుకుంటున్నారో చూద్దాం. ఈ చిత్రంలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తారు. ఆ పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యడని, అతని కామెడీ టైమింగ్ బావుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ ఫుల్ ఫన్ సినిమా అని చెబుతున్నారు. ఫస్టాఫ్ అద్భుతమని, లవ్ ట్రాక్ క్యూట్‌గా ఉందని, చాలారోజుల తర్వాత ఆరోగ్యకరమైన కామెడీ చూపించారని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నితిన్ సరికొత్త రోల్‌లో కనిపించి అదరగొట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వినోదం కోరుకునే ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుందని అంటున్నారు. రాజశేఖర్ రోల్ తక్కువే అయినా ఆయన కనిపించిన సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. రావు రమేష్ పాత్ర ప్రధాన బలం అని మరో నెటిజన్ అన్నారు. సెకెండాఫ్ ఫుల్ ఫనగా నడిచిందని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కథలో కొత్తదనం లేదని అవుట్ డేటెడ్, డిజాస్టర్ అని మండిపడుతున్నారు. మరికొందరు నెటిజన్లు సంపూర్ణేష్ బాబు సినిమాలా ఉందని, అన్ని సినిమాల స్ఫూప్‌లా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వక్కంతం వంశీ ఆర్డినరీ కథనే చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నితిన్ చెప్పినట్లు వంశీ రాసిన అత్యుత్తమ కథల్లో ఇదే బెస్ట్ అని కొందరు నెటిజన్లు కూడా అంటున్నారు. నితిన్ కు హిట్ వచ్చిందని ప్రశంసలు తెలుపుతున్నారు.