విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ‘వీ నెక్స్ట్’ కు ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డు’ వరించింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ అవార్డ్స్ వేదికలో ‘మిషన్ వీ’ కాన్సెప్ట్‌కుగానూ ‘బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు’ దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ తిరత్ సింగ్ రావత్ చేతుల మీదుగా విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ డా.సిద్దేశ్వర్ మనోజ్ ఈ అవార్డును అందుకున్నారు. దీంతో పాటు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా విశాక టీమ్‌కు దక్కాయని తెలిపారు. ఈ సందర్భంగా విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ డా.సిద్దేశ్వర్ మనోజ్ మాట్లాడుతూ.. ‘‘ ‘మిషన్ వీ’ కాన్సెప్ట్‌కు ‘నేషనల్ అచీవర్స్ రీకగ్నైజేషన్ ఫోరం అవార్డ్స్’లో ‘బెస్ట్ క్రియేటీవ్ బ్రాండ్ అవార్డు’ దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ‘ఇన్‌హౌజ్’లో విశాక రూపొందించిన కాన్సెప్ట్‌కు అవార్డు రావడం బిగ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాం. ఇలాంటి కాన్సెప్ట్‌లకు చాలా అరుదుగా జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుంది. తెలంగాణ నుండి ఈ అవార్డును దక్కించుకున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాం. మా ‘వీ నెక్స్ట్’ ప్రాజెక్ట్ గో-గ్రీన్ నినాదంతో ఉండనుంది. ఎన్విరాన్మెంట్ ను కాపాడేందుకు ‘వీ నెక్స్ట్’ను లాంచ్ చేశాం. భవన నిర్మాణాల్లో ప్రతి యేటా కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. వాటిని నరకకుండా విశాక టీం గో–గ్రీన్ నినాదంతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. ప్రతి నెలా ఏదో ఒక మంచి కాన్సెప్ట్‌తో ప్రజల ముందుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. డా.సిద్దేశ్వర్ మనోజ్ విషయానికి వస్తే.. ఆయన 2013లో ‘ప్రియ ప్రేమలో ప్రేమ్’ చిత్రం ద్వారా దర్శకుడిగానూ, హీరోగానూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.