మన్సూర్ అలీఖాన్. చిరంజీవి, త్రిష, ఖుష్బులపై కేసు పెట్టి తన పంతం నెగ్గించుకున్నాడు. దీంతో వారం పదిరోజులుగా నిశబ్దంగా ఉన్న ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చి ట్రెండింగ్ అవుతున్నది. ఇప్పుడు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. గత రెండు నెలలుగా త్రిష, మన్సూర్ల మధ్య తీవ్ర వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. లియో సినిమా విజయం అనంతరం ఆ చిత్రంలో లియోకు ప్రధాన స్నేహితుడిగా నటించిన మన్సూర్ ఓ బీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు చాలా సినిమాలలో బెడ్ సన్నివేశాలలో నటించానని ఈసినిమాలోనూ త్రిషతో అలాంటి సన్నివేశాలు ఉంటాయనుకుంటే నిరాశే ఎదురైంది అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరలై కావడంతో దేశమంతటా చర్చనీయాంశం అయింది.