ఖజురహో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 16న ప్రారంభం కానుంది. వారంపాటు జరిగే ఈ వేడుకను అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి అంకితం ఇవ్వనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో భారతీయ చిత్ర పరిశ్రమకు శ్రీదేవి అందించిన సేవలు చిరస్మరణయమైనవని పేర్కొన్నారు. నిర్వాహకుల్లో ఒకరైన రాజా బుందేలా మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వయసులో శ్రీదేవి బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. తన వెర్సటైల్ యాక్టింగ్, సృజనాత్మకమైన నటనతో అగ్ర శిఖరానికి చేరారు. హిందీ, తెలుగు. తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో అగ్ర తారగా ఎదిగారు. ఆమె ఏ భాషలో పని చేసిన తనకంటూ ప్రత్యేకంగా స్థానం సంపాదించుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గానూ ఈ వేడుక ద్వారా ఆమెకు ఆమెకు ఘనమైన నివాళి అర్పిస్తాం’’ అని తెలిపారు.