డీప్‌ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటి ఆలియా భట్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డీప్‌ఫేక్‌తో తన వీడియో రావడం చాలా బాధేసింది. ఈ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడ మంచి ఉంటుందో.. అక్కడ చెడు కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యను పరిష్కరించడానికి మార్గం కనుగొనాలి. ప్రజలకు రక్షణ కల్పించేలా చట్టాలు తీసుకురావాలి అని అన్నారు.