టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. గత కొంతకాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో ఈ హీరో కాస్త విరామం తీసుకున్నాడు. అయితే పొలిటికల్ సీజన్ నడుస్తుండడంతో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఈ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా 3 రోజుల టాకీ పార్ట్ మరియు రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇటీవల హైదరాబాద్‌లోని పండ్ల మార్కెట్లో క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను మూవీ మేకర్స్ చిత్రీకరించారు.
ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.