నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది.
తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్ ఈవెంట్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత నటుడికి పెద్ద బాధ్యత ఉంటుందని, తప్పులకు తావు ఉండదని అన్నారు.
కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.... త్వరలో మూవీ గ్లింప్సె వెలువడుతుంది మరియు దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మీరు దేవారాతో కొత్త ప్రపంచానిచూస్తారు. ఇందులో చాలా VFX వర్క్ ఉంది. మేము తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తాము. ఓపికపట్టండి అంటూ వెల్లడించారు.