టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కెరీర్లో ప్రతినిధి సినిమా మైలురాయిగా నిలిచింది. ప్రతినిధి 2 సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.