ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాదంలో హీరోయిన్ నివేదా పేతురాజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2019, 06:34 PM

తమిళ భామ నివేదా పేతురాజ్ వివాదంలో ఇరుక్కుంది . తాజాగా ఈ భామ మధురై లోని మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళింది అదే వివాదానికి కారణం అయ్యింది . దర్శనం కోసం వెళితే వివాదం ఏంటి ? అని అనుకుంటున్నారా ? గుడి లోకి మొబైల్ ఫోన్ లను తీసుకెళ్లడం నిషేధం అయితే నివేదా పేతురాజ్ హీరోయిన్ అంటే సెలబ్రిటీ కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు చూసి చూడనట్లుగా పంపించి ఉంటారు దాంతో హాయిగా లోపల ఫోటోలు దిగడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో పెట్టేసింది .


 ఇంకేముంది వివాదం రాజుకుంది . గుడిలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దు అన్న విషయాన్నీ మర్చిపోయి ఇలా చేస్తావా ? నువ్ సెలబ్రిటీ అయినంత మాత్రాన అమ్మవారి ముందు సామాన్య భక్తురాలివే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాపం . తమిళ చిత్రాల్లో నటించే ఈ భామ తాజాగా తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa