ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసియల్ : OTT ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదికేశవ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 04:08 PM

పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఆదికేశవ చిత్రం నవంబర్ 24, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి  తెలిసిందే. ప్రఖ్యాత OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఆదికేశవ డిసెంబర్ 22, 2023 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది.


ఈ సినిమాలో సదా, సుమన్, రాధిక శరత్‌కుమార్, అపర్ణా దాస్, సుధాకర్ మరియు ఇతరలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa