బిగ్ బాస్ 7 తెలుగు విజేతగా పల్లవి ప్రశాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గత రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు అతనిని 6 గంటలకు పైగా విచారించి అరెస్టు చేసారు. బిగ్ బాస్ విజయం వేడుకల ఉత్సాహం మధ్య పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్, స్నేహితుడు వినయ్ మరియు అభిమానులు కలిసి అనుకోకుండా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. దీంతో అతడిని పోలీసులు పట్టుకున్నారు. విచారణ అనంతరం పల్లవి ప్రశాంత్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని న్యాయమూర్తి వెల్లడించారు. అనంతరం అతడిని, అతని సోదరుడిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.