కన్నడ నటి రష్మిక మందన్నకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలకు డిజిటల్ యుగం శాపంగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సమస్య తర్వాత పలువురు రష్మిక మందన్నకు మద్దతుగా నిలిచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. నటి యొక్క డీప్ ఫేక్ వీడియో వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ఈరోజు ప్రశ్నించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ నలుగురు వీడియోను అప్‌లోడ్ చేసినవారు కాని క్రియేట్ చేసిన వాళ్ళు కాదు. వారు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి వీడియోను అప్‌లోడ్ చేశారు. పోలీసు అధికారులు ఈ నలుగురిని విడిచిపెట్టారని సమాచారం. రానున్న రోజుల్లో మరింత మందిని పోలీసులు విచారించనున్నారు.