ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారం ఓటీటీ చిత్రాలు ఇవే

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 22, 2023, 05:26 PM

ఈవారం ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు చూసినోళ్ల‌కు చూసినంత నాన్స్టాప్ వినోదం అంద‌నుంది. ఆ జానర్ ఈ జాన‌ర్ అని కాకుండా దాదాపు ప‌ది భిన్న‌మైన చిత్రాలు సినీ అభిమానుల‌ను ఈ వారం అల‌రించ‌నున్నాయి. అయితే ఈసారి ఒక‌టి రెండు కాకుంండా ఏకంగా డ‌జ‌నుకు పైగా తెలుగులోకి డ‌బ్బింగ్ చేసిన సినిమాలు, వెబ్ సీరిస్‌లు దండ‌యాత్ర చేయ‌నున్నాయి. ఇందులో మ‌న దేశంతో పాటు కొరియ‌న్ నుంచి అధికంగా డ‌బ్బింగ్ చేసినవి ఉన్నాయి. ఆ చిత్రాలేంటో.. ఏ ఏ ఫ్లాట్ ఫాంల‌లో వ‌స్తున్నాయో చూసేయండి. విధార్థ్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన వ్యంగ్య హ‌స్య త‌మిళం చిత్రం కుయికో ఈ రోజు(డిసెంబ‌ర్ 22) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో త‌మిళ‌, తెలుగు, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ జ‌రుగుతున్న‌ది.ప్ర‌ఖ్యాత హాలీవుడ్ డీసీ చిత్రాల ద్వారా డైరెక్ట‌ర్‌ జాక్ స్నైడర్ దర్శకత్వంలో రూపొందించిన రెబ‌ల్ మూన్  అనే స్పేస్ ఆడ్వెంచ‌ర్ చిత్రం ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.ఈ మ‌ధ్యే ఒక్క‌ ఇంగ్లీష్ భాష‌లో మాత్ర‌మే డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన‌ నో వేర్ అనే స్పానిష్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఇప్పుడు తెలుగుతో పాటు, త‌మిళ భాష‌లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది. జియోంగ్ సోంగ్ క్రియేచ‌ర్  అనే హిస్టారిక‌ల్, మిస్ట‌రీ, హ‌ర్ర‌ర్‌ థ్రిల్లర్ జాన‌ర్‌లో వ‌స్తున్న కొరియ‌న్ సిరీస్ సీజ‌న్ 1 పార్ట్ 1 ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి కొరియ‌న్‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.కేర‌ళలో ఒకే ఫ్యామిలీలో జరిగిన ఆరుగురి అనుమానాస్ప‌ద హ‌త్య‌ల నేప‌థ్యంలో వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందించిన క‌ర్రీ అండ్ సైనెడ్ ది జాలీ జోష‌ప్ కేస్‌ అనే డాక్యుమెంట‌రీ సిరీస్ ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి స్ట్రీమింగ్ మ‌ళ‌యాళం, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ఈ రోజు (డిసెంబ‌ర్ 22) నుంచి అవుతున్న‌ది. క‌న్న‌డ‌ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు, న‌టుడు రాజ్ బీ శెట్టి హీరోగా వ‌చ్చిన చిత్రం టోబీ. ఈ రోజు శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 22) నుంచి సోనీ లీవ్‌లో తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న‌ది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com