అరియనా తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినీ అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. బిగ్ బాస్ 4 లో మెరిసిన అరియనా ప్రస్తుతం బుల్లితెరపై క్రేజీ బ్యూటీ. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.ఆమధ్యన సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతోంది. ఆ మద్యన అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే తొలి చిత్రం. అరియనా సోషల్ మీడియాలో క్యూట్ లుక్స్ తో యువత హృదయాలు దోచుకుంటోంది. నెమ్మదిగా అరియనా ఎక్స్ ఫోజింగ్ పెంచుతోంది. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది. అందుకే ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోస్, వీడియోస్ తో మామూలు రచ్చ చేయడం లేదు.అయితే నాజూగ్గా ఉండే అరియనా ఈ మధ్యన బాగా బొద్దుగా మారింది. దీనితో అరియనా లావు అవుతోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆకతాయిలు మాత్రం అరియనా లావు కావడంతో అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అరియనా తాజాగా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ బికినీ అందాలతో విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఏకంగా స్విమ్మింగ్ పూల్ లో రచ్చ రచ్చ చేస్తూ ఉన్న వీడియో షేర్ చేసింది. నాభి, క్లీవేజ్ సొగసుతో అరియనా యువతని మెస్మరైజ్ చేస్తోంది. తాను బొద్దుగా ఉన్నప్పుడు ఆంటీ అని ట్రోల్ చేసిన వారికి సమాధానంగానే అరియనా ఈ ఫొటోస్ షేర్ చేసినట్లు ఉంది.