మీనాక్షి చౌదరి ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరు. గుంటూరు కారం, తలపతి 68 వంటి ప్రముఖ ప్రాజెక్ట్‌లతో ఈ స్టార్ బ్యూటీ ప్రస్తుతం బిజీగా ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి సెకండ్ లీడ్‌గా కనిపించనుంది మరియు ఈ సినిమా కోసం చాలా ఎగ్జైట్‌గా ఉంది.
విశ్వక్ సేన్ తదుపరి చిత్రంలో మీనాక్షి కనిపించనుంది మరియు వరుణ్ తేజ్‌తో మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లో కూడా ఈ బ్యూటీ కనిపించనుంది. వీటిలో కనీసం రెండు సినిమాలైనా సూపర్ హిట్ అయితే ఆమె కెరీర్ మారిపోవడంతో పాటు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa