విజయ్‌కాంత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘విరుధగిరి’లో ఆయనే హీరో. తన బావ ఎల్.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో ‘తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరరీ అవార్డు’, 2001లో ‘కలైమళి అవార్డు’ 2001లో ‘బెస్ట్ ఇండియన్ సిటిజెన్ అవార్డు’, 2009లో ‘టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు అందుకున్నారు. పలు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కూడా విజయ్‌కాంత్ అందుకున్నారు.
ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ (71) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్రత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు. ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు వెంటిలేటర్‌తో చికిత్స అందిస్తుండగా.. విజయకాంత్ తుదిశ్వాస విడిచారు.