ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్ మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. విజయ్‌కాంత్ మృతి చాలా బాధాకరమన్నారు. సినిమా, రాజకీయాల్లో ఆయన నిజమైన పవర్ హౌజ్ అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన ఆలోచనలు విజయ్‌కాంత్ కుటుంబసభ్యులు, స్నేహితులతో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు విజయ్‌కాంత్ (71) కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్రత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు.