తనకు పెళ్లైందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఖండించారు. ‘నాకు సంబంధించిన ప్రతి విషయం మీతో పంచుకుంటున్నాను. అలాంటిది పెళ్లి చేసుకున్న విషయాన్ని మీ దగ్గర ఎందుకు దాస్తాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, అబద్దపు ప్రచారాలను నమ్మవద్దు’ అని శ్రుతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా బాయ్‌ఫ్రెండ్ శంతనుతో ఆమె కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే.