తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం అని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అని అన్నారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.