తమిళ-నటుడు రాజకీయ నాయకుడు విజయకాంత్ తన 71 ఏళ్ల వయసులో గురువారం చెన్నైలో కన్నుమూశారు.కరోనా బారిన పడిన ఆయన చెన్నై ఆస్రత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. అయితే కెప్టెన్ విజయ్‌కాంత్ పార్థివ దేహాన్ని తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సందర్శించి ఆయనికి నివాళులర్పించారు. దళపతి విజయ్ సినీ కెరీర్ తొలినాళ్లలో కెప్టెన్ విజయకాంత్ తో కలిసి సినిమాలు చేసాడు.
1952 ఆగస్టు 25న అప్పటి మద్రాసులో జన్మించారు. 1990లో ప్రేమలతను వివాహమాడారు. కెప్టెన్ విజయకాంత్ కెరీర్ మొత్తంలో 150 సినిమాల్లో నటించారు. 1991లో ఆయన నటించిన కెప్టెన్ ప్రభాకరన్ చిత్రం అతనికి ‘కెప్టెన్’ అనే పేరు తెచ్చిపెట్టింది. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా విజయకాంత్ ఉన్నారు. అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు మరియు 2006 వరకు ఆ పదవిలో ఉన్నాడు. ఆ సమయంలోనే అతను తన రాజకీయ పార్టీ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK)ని ప్రారంభించాడు. 2006 తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ బలీయమైన శక్తిగా కనిపించింది. 2011లో తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు.