తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ఎంతో కష్టపడాలి. ఈ ఏడాది కొందరు దర్శకులు అవకాశం రావడంతో తీసిన తొలి సినిమాతోనే అదరగొట్టేశారు. జబర్ధస్త్ వేణు-బలగం, షణ్ముఖ ప్రశాంత్-రైటర్ పద్మభూషన్, శ్రీకాంత్-దసరా, సుమంత్ ప్రభాస్-మేమ్ ఫేమస్, కళ్యాన్ శంకర్-మ్యాడ్, శౌర్యవ్-హాయ్ నాన్న వంటి దర్శకులు తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దర్శకుల తదుపరి సినిమాలపై చిత్ర పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.