ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగచైతన్యకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 30, 2023, 03:24 PM

నాగచైతన్య మంచి ఫుడీ.. అదై టైమ్ లో ఆయన ఫిట్ నెస్ కూడా బాగా మెయింటేన్ చేస్తుంటారు. ఫుడ్ మీద చైతూకున్న గ్రీప్ మూమూలుది కాదు.. ఆ ఎక్స్ పీరియన్స్ ను వాడుకుని.. హైదరాబాద్ తో పాటు పలు చోట్ల ఆయన ఫుడ్ బిజినెస్ లు కూడా చేస్తున్నారట. పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఓపెన్ చేసినట్టు సమాచారం. ఈక్రమంలో నాగచైతన్యను ఇష్టమైన ఫుడ్ గురించి ప్రస్తుతం ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అక్కినేనివారి హీరో ఇష్టంగా ఏ ఫుడ్ తింటారు. ఏంటీ..? ః


 ప్రస్తుతం కర్నాటకలో ఉన్నారు చైతూ.. చందూమొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈమూవీ షూటింగ్ లో సాయి పల్లవి కూడా అడుగు పెట్టింది. ఇక రీసెంట్ గా   ధూత వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టిన  చైతూ మంచి హిట్ నుఅందుకున్నాడు.  ప్రస్తుతం తండేల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్  గోకర్ణలో జరుగుతుంది. ఇక చైతూ మంచి నటుడు, ఫుడీ.. మంచి బిజినెస్ మెన్ కూడా. ఆయనకు ఫుడ్ అంటే ఇష్టం కాబట్టే పుడ్ బిజినెస్ లో దిగాడు. హైదరాబాద్ లో షోయూ అనే రెస్టారెంట్ ప్రారంభించాడు. 


 


తనకు నచ్చిన ఫుడ్ గురించి వెల్లడించాడు చైతూ.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ తనకు ఇష్టమైన ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను అచ్చమైన తెలుగు తిండి తింటానన్నాడు చైతూ.. వైట్ రైస్.. ముద్దపప్పులో నెయ్యివేసుకుని తింటాడట. అంతే కాదు ముద్దు పప్పు..పచ్చిపులుసు కాంబినేషన అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు చైతూ. అంతే కాదు.. వాటికి సైడ్ డిష్ లు గా మటన్  కాని..రొయ్యల ప్రై కాని తీసుకుంటాడట. 


 ఈ ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం అంటున్నాడు నాగచైతన్య.. అంతే కాదు అప్పుడప్పుడు జపనీస్ ఫుడ్ కూడా తింటాడట చైతూ.. ఇక చైతూ ఫుడ్ హ్యాబిడ్స్ తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఇప్పటికీ మన తెలుగు వంటలు హీరోలు ఇష్టపడుతున్నారంటే గ్రేట్ అంటూ  మాట్లాడుకుంటున్నారు జనాలు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే ఈ విషయం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com